బీఎస్‌ఎఫ్ ప్రచారకర్తగా విరాట్ కోహ్లి | Virat Kohli will soon be appointed as 'ambassador of BSF' | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్ ప్రచారకర్తగా విరాట్ కోహ్లి

Sep 20 2013 9:14 PM | Updated on Sep 1 2017 10:53 PM

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోనుంది.

న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని బీఎస్‌ఎఫ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోనుంది. దేశంలోని రెండో అతిపెద్ద పారామిలటరీ దళానికి అతను ప్రచారకర్తగా సేవలందించే అవకాశాన్ని పొందాడు. త్వరలోనే సీనియర్ అధికారుల సమక్షంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి అతన్ని అధికారికంగా నియమించుకుంటారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్ చీఫ్ సుభాష్ జోషి, ఇతర అధికారులు పాల్గొంటారు.

 

దళంలో యువతను ఆకర్షించేందుకు ఈ నియామకం తమకు దోహదం చేస్తుందని బీఎస్‌ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ నెగ్గిన 2011 వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన 25 ఏళ్ల కోహ్లి ఇప్పటికే భావి కెప్టెన్‌గా పలువురి కితాబు అందుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement