బ్రాడ్‌.. స్లెడ్జింగ్‌ మాకు వచ్చు: కోహ్లి

Virat Kohli Teaches Stuart Broad a Lesson for Sledging  - Sakshi

నాటింగ్‌హామ్‌‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున అరంగేట్రం చేసిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ పట్ల ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అసభ్యంగా ప్రవర్తించి రిఫరీలతో చివాట్లు కూడా తిన్నాడు. అయితే జట్టును ముందుండి నడిపించే సారథి కోహ్లి ఆటగాళ్లను వెన్నంటి ప్రోత్సహించడంలోను ముందుంటాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు మైదానంలో ఎదురయ్యే స్లెడ్జింగ్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ మద్దతు పలుకుతాడు.

ఇలా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు కోహ్లి దిమ్మతిరిగేలా చేశాడు. స్లెడ్జింగ్‌ అంటే ఎంటో పాఠాలు చెప్పాడు. షమీ బౌలింగ్‌లో బ్రాడ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. టీమిండియా ఫీల్డర్లు ‘కమాన్‌ షమ్మో’ అని అరవసాగారు. ఇది బ్రాడ్‌కు కొంత ఇబ్బంది కలిగించింది. వెంటనే కోహ్లితో ‘మ్యాన్‌.. వారు చాలా కోపంగా ఉన్నారు’ అని అన్నాడు. దీనికి కోహ్లి ‘ఇది నీవు యంగస్టార్‌తో ప్రవర్తించిన తీరుకు సమాధానం’ అని తెలిపాడు. మళ్లీ బ్రాడ్‌ ఇది టెస్టు క్రికెట్‌ అనగా.. ఈ ఆగ్రహం.. ఆ కోపమేనని కోహ్లి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ‘మీరు మంచిగా ఉంటే మేం మంచిగా ఉంటాం.. మీరు స్లెడ్జింగ్‌ చేస్తే మేం చేస్తాం’ అనే రితీలో కోహ్లి సమాధానమివ్వడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన బ్రాడ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ ఇచ్చారు. బ్యాట్స్‌మన్‌ ఔటైనప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, అసభ్య సంకేతాలతో ఎగతాళి చేస్తే ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.1.7 ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉంది.నాలుగో టెస్టు ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది.

చదవండి: బ్రాడ్‌ ఓవరాక్షన్‌.. మ్యాచ్‌ ఫీజులో కోత

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top