38 ఏళ్ల తరువాత విరాట్ సేన | virat kohli and gang equals rare collection in a series against england | Sakshi
Sakshi News home page

38 ఏళ్ల తరువాత విరాట్ సేన

Dec 19 2016 12:39 PM | Updated on Sep 4 2017 11:07 PM

38 ఏళ్ల తరువాత విరాట్ సేన

38 ఏళ్ల తరువాత విరాట్ సేన

విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది.

చెన్నై:విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది. ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్ తో సిరీస్లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు  సాధించారు.
 

ఇదే తరహాలో ఒక సిరీస్ లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం  1978-79 సీజన్ తరువాత ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేశారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే.

 
ఈ మ్యాచ్లో నాయర్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటివరకూ  ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు తలో ఒక సెంచరీ సాధించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement