అంపైరింగ్‌ వరల్డ్‌ రికార్డు సమం!

Umpire Aleem Dar equals Steve Bucknor world record - Sakshi

లండన్‌: పాకిస్తాన్‌కు చెందిన క్రికెట్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసిన అలీమ్‌ దార్‌.. స్టీవ్‌ బక్నర్‌(వెస్టిండీస్‌) రికార్డును సమం చేశారు. ఇప్పటివరకూ స్టీవ్‌ బక్నర్‌ 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి టాప్‌లో ఉండగా, ఇప్పుడు అతని సరసన 51  ఏళ్ల అలీమ్‌ దార్‌ నిలిచారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అలీమ్‌ దార్‌ ఈ మార్కును చేరారు. 

దీనిపై అలీమ్‌ దార్ మాట్లాడుతూ.. ఇదొక అతి పెద్ద ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అందులోనూ తన రోల్‌ మోడల్‌ బక్నర్‌ సరసన నిలవడం ఇంకా ఆనందంగా ఉందని తెలిపారు.  ఈ ఘనత సాధించడానికి ఆ దేవుడి సాయంతో పాటు ఐసీసీ, పీసీబీల సహకారం కూడా మరువలేనిదన్నారు. తన సహచరులకు,  తన కోచ్‌లకు అలీమ్‌ దార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారం వెలకట్టలేనిదని, వారు నుంచి తనకు సహకారం అందకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. 2003లో ఢాకాలో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు ఫార్మాట్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసిన అలీమ్‌ దార్‌.. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 376 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top