ఫైనల్ దశకు భారత్ | The final step to India | Sakshi
Sakshi News home page

ఫైనల్ దశకు భారత్

Nov 4 2016 11:54 PM | Updated on Sep 4 2017 7:11 PM

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుస విజయాలతో ...

ప్రపంచ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ

బిల్బావో (స్పెరుున్): బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్ దశకు అర్హత సాధించింది. శుక్రవారం ప్లేఆఫ్ గ్రూపు లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1తో ఫ్రాన్స్‌ను కంగుతినిపించింది. మొదట జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోరులో మహిమా అగర్వాల్-సాత్విక్ సారుురాజ్ జోడి 21-14, 23-21తో డెల్ఫిన్ డెల్‌రూ-టామ్ గిచ్‌క్వెల్ జంటపై నెగ్గింది.

అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21-16, 23-21తో టొమా పొపొవ్‌ను ఓడించి భారత్‌కు 2-0 ఆధిక్యాన్నిచ్చాడు. చివరగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 23-25, 21-15, 21-12తో యెలే హొయక్స్‌పై గెలుపొందింది. భారత్ గ్రూప్ దశలో బల్గేరియా, ఫిన్లాండ్‌లను ఓడించి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. తదుపరి పోరులో భారత్... థాయ్‌లాండ్‌తో తలపడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement