జిల్లా చెస్ జట్టులో అంజలి, వినీత | The chess team Anjali, Vinita | Sakshi
Sakshi News home page

జిల్లా చెస్ జట్టులో అంజలి, వినీత

Aug 5 2013 12:41 AM | Updated on Sep 1 2017 9:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టుకు అంజలి, వినీత, మిధుశ్, హర్షిత్‌కృష్ణ ఎంపికయ్యారు.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టుకు అంజలి, వినీత, మిధుశ్, హర్షిత్‌కృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం  లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్ చెస్ టోర్నీలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వీరిని ఎంపిక చేశారు.
 
 ఈ నలుగురు వరంగల్‌లో ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ర్టస్థాయి చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ నాయక్ విజేతగా నిలిచాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement