ఓటమితోనే... గెలిచేది, నేర్చేది! | Tendulkar's philosophical reply to SRK's sentimental tweet | Sakshi
Sakshi News home page

ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!

Apr 20 2017 1:34 AM | Updated on Sep 5 2017 9:11 AM

ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!

ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!

ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్‌ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌

షారుక్‌ ట్వీట్‌కు సచిన్‌ స్పందన  

న్యూఢిల్లీ: ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్‌ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌కు బాద్‌షా అయితే... సంచలన బ్యాటింగ్‌తో సచిన్‌ క్రికెట్‌లో పరుగుల మెషీన్‌ అయ్యాడు. ఈ హేమాహేమీలు అప్పట్లో పెప్సీ యాడ్‌లో కలిసి నటించడం... ఇద్దరి స్టార్ల అభిమానుల్ని అదేస్థాయిలో అలరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కొత్తగా ట్వీట్లతోనూ ఒకరికొకరు తమ హృదయ స్పందనను తెలియజేసుకున్నారు. దీనికి ట్విట్టర్‌ వేదికైంది. ఈ సెలబ్రిటీల ట్వీట్లు ఇరు వర్గాల అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఉన్నాయి. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్‌– ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’.

చ్చే నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో షారుక్‌... మాస్టర్‌ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నేను బలంగా నమ్ముతున్నా... నీవు బాగా ఆడినపుడు నా సినిమా బాగా ఆడింది. అదే నీవు విఫలమైనపుడు నా సినిమా ఫెయిలైంది. నీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడ్ని. నీ బయోపిక్చర్‌కు ఆల్‌ ద బెస్ట్‌ సచిన్‌’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన సచిన్‌ ‘జీవితంలో ఓటమే లేకుంటే గెలుపనేదే ఉండదు... నేర్చుకునేదీ ఉండదు. శతకోటి అభిమానుల్లాగే నీ మాటలు నా మనసును తాకాయ్‌..! లవ్‌ యూ షారుక్‌’ అని పోస్ట్‌ చేశారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌ అభినేత్రి మాధురి దీక్షిత్, శ్రేయా ఘోషల్‌లు కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement