
మూడో వన్డేకు రైనా అనుమానం
భారత బ్యాట్స్మన్ సురేష్ రైనా ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతడి మోచేతికి గాయమయింది.
అక్లాండ్: భారత బ్యాట్స్మన్ సురేష్ రైనా ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతడి మోచేతికి గాయమయింది. దీంతో రేపు న్యూజిలాండ్తో జరగనున్న మూడో వన్డేలో అతడు ఆడేది అనుమానంగా మారింది. నెట్లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి ఎడమ చేతికి గాయమయిందని ఇండియన్ టీమ్ మేనేజర్ డాక్టర్ ఆర్ ఎన్ బాబా తెలిపారు.
అయితే ముందు జాగ్రత్తగా ఎక్స్రే తీయించామని, అంతా బాగానే ఉందని చెప్పారు. గాయం చిన్నదేనని, మ్యాచ్ ఫిట్ అవుతాడా, లేదా అనేది రేపటికి తెలుస్తుందన్నారు. ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా 0-2తో వెనకబడివుంది. మూడో వన్డేలో నెగ్గితేనే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి.