చాంప్‌ సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ | St joseph public school wins overall championship | Sakshi
Sakshi News home page

చాంప్‌ సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌

Aug 31 2017 12:35 PM | Updated on Sep 12 2017 1:29 AM

తెలంగాణ ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్, కింగ్‌ కోఠి జట్టు సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్, కింగ్‌ కోఠి జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌ సీనియర్‌ బాలికల టీమ్‌ విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్‌ బాలికల కేటగిరీలో సెయింట్‌ జోసెఫ్‌ జట్టు 40 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. జూనియర్‌ బాలికల టీమ్‌ విభాగంలో 63 పాయింట్లు స్కోర్‌ చేసిన శ్రీసాయి పబ్లిక్‌ స్కూల్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను దక్కించుకుంది. సీనియర్‌ బాలుర విభాగంలో జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ (51 పాయింట్లు), జూనియర్‌ బాలుర విభాగంలో శ్రీసాయి పబ్లిక్‌ స్కూల్‌ (54 పాయింట్లు) తమ విభాగాల్లో ఓవరాల్‌ చాంపియన్లుగా నిలిచాయి. వ్యక్తిగత విభాగాల్లో కె. హర్షిత (సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌), జి. తేజస్విని, నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్‌ స్కూల్‌), హృషి అగస్త్య (జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌), సాకేత్‌రెడ్డి, విభాస్కర్‌ (శ్రీ సాయి పబ్లిక్‌ స్కూల్‌) తమ తమ విభాగాల్లో ఓవరాల్‌ చాంపియన్‌లుగా నిలిచారు.  



ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

5కి.మీ రేస్‌ వాక్‌ జూనియర్‌ బాలురు: 1. ఆర్‌. సాకేత్‌రెడ్డి, 2. విజయ్‌ ప్రతాప్‌ సింగ్, 3. భువనేశ్‌రెడ్డి. 8 సీనియర్‌ బాలురు: 1. హృషికేశ్, 2. రవికిరణ్, 3. పృథ్వీ నాయక్‌. 8 3కి.మీ రేస్‌ వాక్‌ సీనియర్‌ బాలికలు: 1. రక్ష నంద, 2. హంపి వర్ధిని, 3. జియా. 8 జూనియర్‌ బాలికలు: 1. వాసవి, 2. వైష్ణవి, 3. శ్రీయ రెడ్డి. 8 200మీ. పరుగు జూనియర్‌ బాలికలు: 1. టి. నిఖితా రెడ్డి, 2. శ్రీ వర్షిణి, 3. ఎ. కృతి. 8 సీనియర్‌ బాలికలు: 1. కె. హర్షిత, 2. టి. ప్రణల్లిక, 3. విన్నీ మాథ్యూ.

సీనియర్‌ బాలురు: 1. హృషి అగస్త్య, 2. రుత్విక్‌ రెడ్డి, 3. రూపేశ్‌. 8 హైజంప్‌ జూనియర్‌ బాలికలు: 1. కె. బేబిశ్రీ, 2. మాధురి, 3. సూర్య చంద్ర ప్రభ లేఖ.  సీనియర్‌ బాలికలు: 1. కసక్‌ విజయ్‌వర్గీ, 2. టి. ప్రణల్లిక, 3. హనియా అహ్మద్‌.
 జూనియర్‌ బాలురు: 1. కె. యశ్వంత్, 2. విష్ణు రేవంత్‌ రెడ్డి, 3. భీమ్‌ భరత్‌. 8 సీనియర్‌ బాలురు: 1. ఆర్యన్, 2. హృషికేశ్, 3. రవి వేద్య. 8 ట్రిపుల్‌ జంప్‌ సీనియర్‌ బాలురు: 1. హృషి అగస్త్య, 2. కార్తీక్‌ సింగ్, 3. బి. రోహిత్‌. 8 జూనియర్‌ బాలురు: 1. బి. భీమ్‌ భరత్, 2. ఉజ్వల్‌ ప్రకాశ్, 3. నితిన్‌ కుమార్‌. 8 సీనియ్‌ బాలికలు: 1. టి. ప్రణల్లిక, 2. కె. హర్షిత, 3. మూవికా రెడ్డి.

80మీ. హర్డిల్స్‌ జూనియర్‌ బాలికలు: 1. సూర్యచంద్ర ప్రభలేఖ, 2. కె. దివ్య, 3. పి. లీనా మార్గరేట్‌. 8 సీనియర్‌ బాలికలు: 1. కసక్‌ విజయ్‌వర్గీ, 2. హనియా అహ్మద్, 3. మడీహున్నిసా బేగం. 8 100మీ. హర్డిల్స్‌ జూనియర్‌ బాలికలు: 1. బాలాజీ కృష్ణ, 2. ఆర్‌. శ్రేయాంక్‌రెడ్డి, 3. శ్రౌనక్‌ రెడ్డి. 8 110మీ. హర్డిల్స్‌ సీనియర్‌ బాలురు: 1. కార్తీక్‌సింగ్, 2. పి. వంశీ, 3. రుత్విక్‌ రెడ్డి.  8 జావెలిన్‌ త్రో సీనియర్‌ బాలురు: 1. పి. వంశీ, 2. పి. రోహిత్, 3. సత్య వర్ధన్‌ రెడ్డి. 8 జూనియర్‌ బాలురు: 1. సందీప్‌ రెడ్డి, 2. నితిన్‌ కుమార్, 3. రాకీ కుమార్‌. 8 జూనియర్‌ బాలికలు: 1. జి. తేజస్విని, 2. నందిని, 3. అనన్య. 8 సీనియర్‌ బాలికలు: 1. హనా రెహమాన్, 2. బి. నిహారిక, 3. శ్రీనిత్య. 8 400మీ. పరుగు సీనియర్‌ బాలికలు: 1. వింధ్య, 2. టి. ప్రణల్లిక, 3. అలీనా సఫి.  8 సీనియర్‌ బాలురు: 1. హృషి అగస్త్య, 2. రూపేశ్, 3. శ్రీనివాస్‌. 8 జూనియర్‌ బాలురు: 1. విభాస్కర్‌ కుమార్, 2. వంశీధర్‌రెడ్డి, 3. విష్ణు రేవంత్‌.  8 జూనియర్‌ బాలికలు: 1. టి. నిఖితా రెడ్డి, 2. సుమయ్యా ఫాతిమా, 3. ప్రేరణ లక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement