నాలో అది కొత్త అనుభూతిని కలిగిస్తోంది: అయ్యర్‌ | Shreyas Iyer Says Staying with Kohli And Rohit Helps Learn | Sakshi
Sakshi News home page

నాలో అది కొత్త అనుభూతిని కలిగిస్తోంది: అయ్యర్‌

Jan 25 2020 11:04 AM | Updated on Jan 25 2020 11:04 AM

Shreyas Iyer Says Staying with Kohli And Rohit Helps Learn - Sakshi

గెలిపించినందుకు గర్వంగా ఉంది..

ఆక్లాండ్‌: భారీ సి​క్సర్‌తో మ్యాచ్‌ను ముగించడం తనలో ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తోందని టీమిండియా బ్యాట్స్‌మన్‌, తొలి టీ20 హీరో శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తెలిసిందే. టీమిండియా విజయంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ అర్థ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా భారీ సిక్సర్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టి కివీస్‌ పర్యటనను విజయంతో ఆరంభించాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం చహల్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. టీమిండియాను గెలిపించే అవకాశం వచ్చి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినందుకు గర్వంగా ఉందన్నాడు.  

‘సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించడం నాలో సరికొత్త అనుభూతి కలుగుతుంది. నేను క్రీజులో ఉన్న ప్రతీ మ్యాచ్‌ను గెలిపించాలనే లక్ష్యంతో ఉంటాను. అంతేకాకుండా క్రీజులో ఎక్కువ సేపు ఉండాలనుకుంటాను. రోహిత్‌ భాయ్‌, కోహ్లి భాయ్‌లతో బ్యాటింగ్‌ చేస్తుంటే మనం(యువ క్రికెటర్లు) ఎంతో నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మ్యాచ్‌ ముగించే సమయంలో వారితో క్రీజులో ఉంటే మనపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్చగా ఆడొచ్చు. దుబె ఔటయ్యాక మంచి భాగస్వామ్యం అవసరమని మనీశ్‌ పాండేకు చెప్పాను. గ్రౌండ్‌ చాలా చిన్నదిగా ఉంది, నాలుగు ఓవర్లలో 50 పరుగులు సాధించాలంటే ఓవర్‌కు ఒక బౌండరీ కొడితే బౌలర్‌ ఒత్తిడి పెరుగుతుందని చెప్పాను. ముందుగా అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంతో విజయం సాధించాం’అని అయ్యర్‌ పేర్కొన్నాడు.  

చదవండి: 
అయ్యర్‌పై ఇయాన్‌ స్మిత్‌ ప్రశంసలు

టీ20 చరిత్రలో ఇదే తొలిసారి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement