రబడ ఒట్టేశాడు : శ్రేయస్‌ అయ్యర్‌

Shreyas Iyer Says Rabada Promised to Bowl Only Yorkers in Super Over - Sakshi

న్యూఢిల్లీ : సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెమటోడ్చి రబడ పుణ్యమా సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టెక్కిన విషయం తెలిసిందే. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఫిరోజ్‌ షా కోట్ల మైదనాంలో అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌.. ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజానిచ్చింది. ఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు తడబడ్డాయి. చిరకు సూపర్‌ ఓవర్‌లో రబడ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసి ఢిల్లీకి విజయాన్నందించాడు. అయితే రబడ యార్కర్లు మాత్రమే వేస్తానని తనకు మాటిచ్చాడని మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ‘సూపర్‌ ఓవర్‌ వేసే ముందు రబడ నేను మాట్లాడుకున్నాం. ఈ ఓవర్‌ మొత్తం యార్కర్లే మాత్రమే సంధిస్తానని రబడ ఒట్టేశాడు. ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఇలా ప్రతి బాల్‌ అద్భుతంగా యార్కర్లు సంధించి విజయాన్నందించాడు’ అని అయ్యర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్‌ ఓవర్‌ ఆడాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. కుల్దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.

ఇక నుంచి ఒక ఓవర్‌ మిగిలుండగానే విజయం అందుకునేలా జాగ్రత్తపడతామని తెలిపాడు. దాటిగా ఆడాలని బ్యాట్స్‌మెన్‌ అంత అనుకున్నామని, పృథ్వీషా ఆ దిశగా ఆడాడని, తన ఆటను అలానే కొనసాగిస్తాడని కూడా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఒత్తిడిలో బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్నందించడం చాలా ఆనందంగా ఉందని రబడ పేర్కొన్నాడు. యార్కర్లు మాత్రమే సంధించాలని భావించానని, తన ప్రణాళిక పనిచేయడంతో విజయం దక్కిందని చెప్పుకొచ్చాడు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఒక వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది. అనంతరం రబడ వేసిన సూపర్‌ ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top