సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌ | Sachin Plays Gully Cricket With Abhishek Bachchan And Varun Dhawan | Sakshi
Sakshi News home page

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

Published Fri, Aug 30 2019 11:16 AM | Last Updated on Fri, Aug 30 2019 11:39 AM

Sachin Plays Gully Cricket With Abhishek Bachchan And Varun Dhawan - Sakshi

తనతో పాటు క్రికెట్‌ ఆడతారా అని బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ముంబై : మైదానంలోనే కాదు బయట కూడా స్ఫూర్తిమంతంగా వ్యవహరించడం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నైజం. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ కార్యక్రమానికి సచిన్‌ మద్దతు పలికాడు. ఈ క్రమంలో గురువారం గల్లీలో క్రికెట్‌ ఆడాడు. అయితే, తనతో పాటు క్రికెట్‌ ఆడతారా అని బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, అభిషేక్‌ బచ్చన్‌లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్‌ వారితో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు. 

తొలుత సచిన్‌ బ్యాటింగ్‌ చేయగా.. వరుణ్‌, అభిషేక్‌ బంతులేశారు. అనంతరం వారిద్దరికీ బౌలింగ్‌ చేసిన లిటిల్‌ మాస్టర్‌ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్‌ను ఎంకరేజ్‌ చేశాడు. ఆమెతో వరుణ్‌, అభిషేక్‌కి బౌలింగ్‌ చేయించాడు. ‘స్పోర్ట్స్‌ ప్లేయింగ్‌ నేషన్’‌, ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’ హాష్‌టాగ్‌లను జత చేస్తూ.. సచిన్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. గల్లీలో క్రికెట్‌ ఆడటం ఆనందం ఉందని సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. కాగా, ఈ ట్వీట్‌పై వరుణ్‌ స్పందించాడు. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్‌ అంటూ ప్రశంసించాడు. మీతో క్రికెట్‌ ఆటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement