కోహ్లి సరసన షబ్బీర్‌ | Sabbir Rahman joins kohli as highest scores in a T20 final | Sakshi
Sakshi News home page

కోహ్లి సరసన షబ్బీర్‌

Mar 18 2018 9:48 PM | Updated on Mar 18 2018 9:49 PM

Sabbir Rahman joins kohli as highest scores in a T20 final - Sakshi

కొలంబో:బంగ్లాదేశ్‌ ఆటగాడు షబ్బీర్‌ రెహ్మాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక అంతర్జాతీయ టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో షబ్బీర్‌ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకలో ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో షబ్బీర్‌ 77 పరుగులు సాధించాడు. ఫలితంగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరసన షబ్బీర్‌ నిలిచాడు.  2014లో లంకేయులతో జరిగిన టీ 20 తుది పోరులో కోహ్లి 77 పరుగులు నమోదు చేశాడు. ఇది టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఐదో అత్యుత్తమం కాగా, తాజాగా ఆ స్థానంలో షబ్బీర్‌ కూడా చేరిపోయాడు.

ఇక టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శామ్యూల్స్‌(వెస్టిండీస్‌) పేరిట ఉంది. 2016లో శామ్యూల్స్‌ అజేయంగా 85 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement