
రోహిత్ శర్మ అర్ధ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు.
మెల్‌బోర్న్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 70 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 26వ అర్ధసెంచరీ.
వన్డేల్లో రోహిత్ 6 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) రికార్డు అతడి పేరిటే ఉంది.