
రోహిత్ శర్మ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
మెల్బోర్న్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో10 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) రికార్డు అతడి పేరిటే ఉంది.