‘రోహిత్‌తో మాట్లాడా.. కానీ క్రికెట్‌ గురించి కాదు’

Rohit And Rahane Currently Enjoying Some Time Off Cricket - Sakshi

టీమిండియా వైస్‌ కెప్టెన్స్‌ రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు ప్రస్తుతం క్రికెట్‌ విరామ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. గత కొంతకాలంగా టెస్టులకే పరిమితమైన రహానే బంగ్లాదేశ్‌ సిరీస్‌తో తర్వాత రంజీ క్రికెట్‌లో ప్రధాన మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కాగా వన్డే, టీ20ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తమ కుటంబసభ్యులతో కలసి జాలీగా ముంబై వీధుల్లో విహరించారు. అనంతరం ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఇరు కుటుంబాలు డిన్నర్‌ చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోలను రహానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా మేమిద్దరం క్రికెటేతర విషయాల గురించి చర్చించుకున్నట్లు పేర్కొన్నాడు. తమ ఇద్దరి పిల్లల గురించి, తల్లిదండ్రులుగా తాము వారిని ఎలా పెంచాలనే దాని గురించి మాట్లాడుకున్నామని తెలిపాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇక రోహిత్‌ ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్దమవుతుండగా.. రహానే ఫిబ్రవరి చివర్లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం రంజీ క్రికెట్‌లో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో కోహ్లి సేన అద్భుత విజయాన్ని సాధించింది. నిర్ణయాత్మకమైన చివరి టీ20 నేడు పుణెలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఎలాగైనా చివరి టీ20లో గెలిసి సిరీస్‌ సమం చేసి పరువు నిలుపుకోవాలని లంక ఆరాటపడుతోంది. 

చదవండి:
ఫ‍్యామిలీని ఎందుకు లాగుతారు
ధోనిని కాదని.. రోహిత్‌కే ఓటు​​​​​​​

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top