పోలీస్‌ బైక్‌ను ఢీకొట్టిన జడేజా భార్య కారు  | Ravindra Jadeja's Wife Riva Solanki Attacked by Police Constable in Jamnagar | Sakshi
Sakshi News home page

పోలీస్‌ బైక్‌ను ఢీకొట్టిన జడేజా భార్య కారు 

May 22 2018 12:48 AM | Updated on May 22 2018 12:48 AM

Ravindra Jadeja's Wife Riva Solanki Attacked by Police Constable in Jamnagar - Sakshi

జామ్‌నగర్‌: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్‌ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కానిస్టేబుల్‌ మాత్రం వీరంగం సృష్టించాడు. రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు.  ఈ ఘటన సరు సెక్షన్‌ రోడ్‌లో జరిగింది. ‘కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారమందిన వెంటనే రీవాను తమ నివాసానికి పంపాం. వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement