riva Solanki
-
పోలీస్ బైక్‌ను ఢీకొట్టిన జడేజా భార్య కారు
జామ్‌నగర్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కానిస్టేబుల్ మాత్రం వీరంగం సృష్టించాడు. రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు. ఈ ఘటన సరు సెక్షన్ రోడ్లో జరిగింది. ‘కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారమందిన వెంటనే రీవాను తమ నివాసానికి పంపాం. వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ వెల్లడించారు. -
'సర్' ఇంట పెళ్లి సందడి!
రాజ్‌కోట్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా-రివాబా సోలంకీల వివాహ వేడుక ఆదివారం జరుగనుంది. గత ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. రేపు ఒక్కటి కాబోతుండటంతో వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. గుజరాత్‌లోని కలావడ్ రోడ్ లో జడేజా-రివాబాల వివాహం జరుగనుంది. భారత క్రికెట్ లో 'సర్'అని ముద్దుగా పిలుచుకునే జడేజా వివాహ కార్యక్రమానికి పలువురు క్రికెటర్లు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా జడేజా వివాహ వేడుకలో క్రికెటర్లు సురేష్ రైనా, బ్రేవోలు ఆడిపాడనున్నారు. చాంపియన్ సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందిన బ్రేవో స్టెప్పులతో జడేజా పెళ్లి మరింత కళకళలాడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కలిసి ఆడినప్పటి నుంచే జడేజా, రైనా, బ్రేవోలు మైదానం బయట కూడా మంచి స్నేహితులు. జడేజా, బ్రేవోలు కలిసి గుజరాత్ లయన్స్ డ్రెస్‌లో ఇటీవలే చాంపియన్ సాంగ్‌కు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ల్లో గుజరాత్ లయన్స్ జట్టుకు జడేజా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు జడేజా అందుబాటులో ఉండటం లేదని గుజరాత్ లయన్స్ స్పష్టం చేసింది. వివాహ ఏర్పాట్లులో బిజీగా ఉన్న జడేజా.. ఏప్రిల్ 21వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండవచ్చని పేర్కొంది. -
నేడు రవీంద్ర జడేజా నిశ్చితార్థం
న్యూఢిల్లీ: మరో భారత క్రికెటర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. 27 ఏళ్ల స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తన స్వస్థలం రాజ్‌కోట్‌కే చెందిన రీవా సోలంకీతో శుక్రవారం నిశ్చితార్థం జరగనుంది. జడేజాకు చెందిన రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’లోనే ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్‌కోట్‌కు చెందిన కాంట్రాక్టర్, కాంగ్రెస్ నేత అయిన హర్దేవ్సింగ్ సోలంకీ కూతురైన 25 ఏళ్ల రీవా మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. కొన్ని నెలలుగా సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో ఉంటోంది. మరోవైపు గతేడాది స్పిన్నర్ హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా వివాహాలతో పాటు, యువరాజ్ నిశ్చితార్థం జరగ్గా... ఈ ఏడాది పేస్ బౌలర్లు మోహిత్ శర్మ నిశ్చితార్థం, వరుణ్ ఆరోన్ వివాహం జరిగాయి.