'సర్' ఇంట పెళ్లి సందడి! | Ravindra Jadeja to Marry Riva Solanki on Sunday | Sakshi
Sakshi News home page

'సర్' ఇంట పెళ్లి సందడి!

Apr 16 2016 5:02 PM | Updated on Sep 3 2017 10:04 PM

'సర్' ఇంట పెళ్లి సందడి!

'సర్' ఇంట పెళ్లి సందడి!

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా-రివాబా సోలంకీల వివాహ వేడుక ఆదివారం జరుగనుంది.

రాజ్కోట్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా-రివాబా సోలంకీల వివాహ వేడుక ఆదివారం జరుగనుంది. గత ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. రేపు ఒక్కటి కాబోతుండటంతో వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. గుజరాత్‌లోని కలావడ్‌ రోడ్ లో జడేజా-రివాబాల వివాహం జరుగనుంది.  భారత క్రికెట్ లో 'సర్'అని ముద్దుగా పిలుచుకునే జడేజా వివాహ కార్యక్రమానికి పలువురు క్రికెటర్లు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా జడేజా వివాహ వేడుకలో క్రికెటర్లు సురేష్ రైనా, బ్రేవోలు ఆడిపాడనున్నారు. చాంపియన్‌ సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందిన బ్రేవో స్టెప్పులతో జడేజా పెళ్లి మరింత కళకళలాడనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కలిసి ఆడినప్పటి నుంచే జడేజా, రైనా, బ్రేవోలు మైదానం బయట కూడా మంచి స్నేహితులు. జడేజా, బ్రేవోలు కలిసి గుజరాత్‌ లయన్స్  డ్రెస్‌లో ఇటీవలే చాంపియన్ సాంగ్కు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.

ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ల్లో గుజరాత్ లయన్స్ జట్టుకు జడేజా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కు జడేజా అందుబాటులో ఉండటం లేదని గుజరాత్ లయన్స్ స్పష్టం చేసింది. వివాహ ఏర్పాట్లులో బిజీగా ఉన్న జడేజా.. ఏప్రిల్ 21వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండవచ్చని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement