ఫెదరర్పై నాదల్ విజయం | Rafael Nadal beats Roger Federer in Australian Open semiFinal | Sakshi
Sakshi News home page

ఫెదరర్పై నాదల్ విజయం

Jan 24 2014 5:25 PM | Updated on Sep 2 2017 2:57 AM

ఫెదరర్పై నాదల్ విజయం

ఫెదరర్పై నాదల్ విజయం

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కు దూసుకెళ్లాడు.

మెల్బోర్న్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో స్విస్ కెరటం రోజర్ ఫెదరర్కు షాకిచ్చాడు. టాప్ సీడ్ నాదల్ 7-6, 6-3, 6-3తో ఆరో సీడ్ ఫెదరర్ను అలవోకగా చిత్తు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో స్టానిస్లాస్ వావ్రింకాతో నాదల్ తలపడనున్నాడు.

దిగ్గజాల మధ్య సాగిన సెమీస్ పోరు ఏకపక్షంగా సాగింది. మంచి ఫామ్లో ఉన్న నాదల్ వరుస సెట్లలో ఫెదరర్ను మట్టికరిపించాడు. తొలిసెట్ నువ్వా నేనా అన్నట్టు సాగినా ఆనక నాదల్దే ఆధితప్యం. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న ఫెదరర్ మరోసారి తేలిపోయాడు. కాగా ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశముంది. ఫైనల్ ప్రత్యర్థి వావ్రింకా మంచి జోరుమీదున్నాడు. ఫైనల్ చేరే క్రమంలో టాప్సీడ్లు జొకోవిచ్, థామస్ బెర్డిచ్ను ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement