
ఆక్లాండ్: రెండో టి20 సంద ర్భంగా కొందరు మహిళా ప్రేక్షకులు ‘న్యూజిలాండ్ క్రికెట్ మేలుకోవాలి... మీ టూ’ అంటూ పోస్టర్‌ను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. తొలి టి20 సందర్భంగా కూడా ఇలాగే చేయబోతే పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. ఈసారి మాత్రం అభ్యంతర పెట్టలేదు. నేరుగా దానిపై ఏ క్రికెటర్ పేరు లేకపోయినా ఆల్‌రౌండర్ స్కాట్ కుగ్‌లీన్ లక్ష్యంగా దీనిని చూపించినట్లు తెలిసింది. దాదాపు రెండేళ్ల క్రితం కుగ్‌లీన్ ‘రేప్’ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే అతను తప్పేమీ చేయలేదని హామిల్టన్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.