అరంగేట్రంతోనే పృథ్వీషా ఖాతాలో రికార్డు

Prithvi Shaw Second Youngest Test Opener For India - Sakshi

రాజ్‌కోట్‌: అద్బుతమైన టెక్నిక్‌, అసాధారణ ఆట, కాస్త అదృష్టం ఇవన్నీ యువ సంచలనం, ముంబై ఆటగాడు పృథ్వీ షా సొంతం. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఈ సంచలనం అరంగేట్రం చేశాడు. సారథి విరాట్‌ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. భారత్‌ తరుపున టెస్టు ఆడుతున్న 293 వ ఆటగాడిగా గుర్తింపు పొందిన పృథ్వీ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రెండో అతి చిన్న వయస్కుడి(18 ఏళ్ల 329 రోజులు)గా అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ జాబితాలో విజయ్‌ మెహ్రా (17ఏళ్ల 265రోజులు) తొలి స్థానంలో ఉన్నాడు. 1955లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్బంగా విజయ్‌ ఖాతాలో ఈ రికార్డు చేరింది. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. గ్రాబియెల్ వేసిన గుడ్‌ లెంగ్త్‌ బంతిని అంచన వేయలేకపోయిన రాహుల్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే అనుమానంతో రివ్యూకి వెళ్లినా అది స్పష్టంగా ఔట్‌ అని తేలడంతో రాహుల్‌ నిరాశగా పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక మరో ఎండ్‌లో అరంగేట్ర ఆటగాడు పృథ్వీ (23)తన జోరును కొనసాగిస్తూ.. పుజారా(0)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 25 పరుగులు చేసింది.

చదవండి: విండీస్‌ టెస్టు: ముంబైకర్‌ అరంగేట్రం

పృథ్వీ షా అద్భుత ప్రస్థానం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top