
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు ఐదో ‘టై’ నమోదు చేసింది. బెంగళూరు బుల్స్, పట్నా జట్ల మధ్య బుధవారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్ 29–29 పాయింట్లతో సమంగా ముగిసింది. జోన్ ‘ఎ’ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 38–15తో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఓడించింది.
గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.