నాకౌట్ దశకు పంకజ్ | Pankaj Advani, Kamal Chawla Enter World Snooker Knockouts | Sakshi
Sakshi News home page

నాకౌట్ దశకు పంకజ్

Nov 23 2014 12:44 AM | Updated on Sep 2 2017 4:56 PM

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు.

ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్
 
 బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-2 (44-74, 60-32, 12-60, 98-0, 80-3, 72-21) ఫ్రేమ్‌ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన లక్కీ వత్నానిపై గెలిచాడు.

ఇదే గ్రూప్‌లో పంకజ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భారత్‌కే చెందిన కమల్ చావ్లా వరుసగా నాలుగో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాడు. మహిళల విభాగం నుంచి చిత్రా మగిమైరాజన్, అమీ కమాని కూడా నాకౌట్ దశకు అర్హత పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement