ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు | Pakistan showers love and respect on Virat Kohli's Teachers' Day tweet | Sakshi
Sakshi News home page

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

Sep 9 2017 7:57 PM | Updated on Mar 23 2019 8:23 PM

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు - Sakshi

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

క్రికెట్‌లో నేడు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు.

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌లో నేడు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నస్థాయి ఆటగాడిగా ఎదిగాడు. మైదానంలో దిగాడంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. అలాగే ఇప్పుడు కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విరాట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. 'ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఉపాధాయ దినోత్సవం శుభాకాంక్షలు' అంటూ పోస్టు చేశాడు. తనను ప్రభావితం చేసిన క్రికెటర్ల లిస్టుతో ఉన్న ఫోటోను పోస్టు చేసి వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఫోటోలో క్రికెటర్ల పేర్లు వాటి కింద విరాట్‌ కూర్చొని ఉన్నాడు.  అందులో భారత దిగ్గజాలు, సచిన్‌, గంగూలీ, ద్రావిడ్‌, లక్ష్మణ్‌, ధోనిలతో పాటు ఇతర దేశాల మాజీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అందులో పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, జావేద్‌ మియాందాద్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్లుకూడా ఉన్నాయి.

అయితే కోహ్లీ లాంటి ఆటగాడు తమ దేశ ఆటగాళ్లను గురువులుగా గౌరవించడంతో పాకిస్తాన్‌ అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బియ్యారు. అంతేకాకుండా 'ఏదో ఒకరోజు ఆ దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో నీపేరు ఉందని ప్రసంసించారు. గొప్ప ఆటగాడివే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడివి, భవిష్యత్తు తరాలకి మార్గదర్శకుడివి అవుతావు, నేటి తరంలో గొప్ప ఆటగాడివి. పాకిస్తాన్‌ ఆటగాళ్లను గౌరవించినందుకు ధన్యవాదాలు' అంటూ ప్రశంసించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement