
పాక్ 281 ఆలౌట్
వెస్టిండీస్తో ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 281 పరుగులకు ఆలౌటైంది.
షార్జా:వెస్టిండీస్తో ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 281 పరుగులకు ఆలౌటైంది. 255/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు సోమవారం ఇన్నింగ్స్ను కొనసాగించిన పాకిస్తాన్.. మరో 26 పరుగులు జత చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. పాక్ ఆటగాళ్లలో సమీ అస్లామ్(74), యూనిస్ ఖాన్(51), మిస్బావుల్ హక్(53), సర్ఫరాజ్ అహ్మద్(51) హాఫ్ సెంచరీలు సాధించారు.
అయితే మిగతా ఆటగాళ్లలో పెద్దగా రాణించకపోవడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరును మాత్రమే బోర్డుపై ఉంచకల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో బిషూ నాలుగు వికెట్లు సాధించగా, గాబ్రియల్ మూడు వికెట్లు తీశాడు. జోసెఫ్ కు రెండు, చేజ్కు వికెట్ లభించాయి.