
ఓ టీవీలో షోలో మహిళలపై అసభ్యకరమైన రీతిలో మాట్లాడి విమర్శల పాలైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మరోసారి అలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు. టీమిండియాలో సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జహీర్‌కి పుట్టిన రోజు శుభాక్షాంక్షలు చెప్పే క్రమంలో హార్దిక్ ఓ వీడియోను షోర్ చేశాడు. ఆ వీడియోనే అతనిని తీవ్ర విమర్శల పాలు చేసింది. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. జహీర్ బౌలింగ్‌లో హర్థిక్ బౌండరి సాధించినది ఆ వీడియో పరమార్థం. దీంతో సీనియర్ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్ అహంకారానికి ఇదే నిదర్శనమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు.
Happy birthday Zak ... Hope you smash it out of the park like I did here 🤪😂❤️❤️ @ImZaheer pic.twitter.com/XghW5UHlBy
— hardik pandya (@hardikpandya7) October 7, 2019