ముగిసిన నాదల్ పోరు
మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ప్రపంచ ఏడో సీడ్ ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పోరు ముగిసింది.
పారిస్: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ప్రపంచ ఏడో సీడ్ ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పోరు ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రెంచ్ ఓపెన్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా 7-6(8), 7-6(7) తేడాతో నాదల్ ను బోల్తా కొట్టించి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లాడు. వావ్రింకా-నాదల్ ల మధ్య హరాహోరీగా సాగిన రెండు సెట్లు టై బ్రేక్ కు దారి తీశాయి. వీటిలో వావ్రింకా పైచేయి సాధించి నాదల్ ను ఇంటికి పంపించాడు.
ఈరోజు రాత్రి జరిగే సెమీ ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ తో వావ్రింకా తలపడతాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7-6(3), 7-6(8) తేడాతో ఐదో సీడ్ బెడ్రిచ్ ను ఓడించి సెమీ ఫైనల్ కు చేరాడు.


