ఎంఎస్‌ ధోని ఐదో‘సారీ’ | MS Dhoni Got 5th Gold Duck for His ODI Career | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ ధోని ఐదో‘సారీ’

Mar 5 2019 4:06 PM | Updated on Mar 5 2019 5:55 PM

MS Dhoni Got 5th Gold Duck for His ODI Career - Sakshi

నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఎంఎస్‌ ధోని డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేదార్‌ జాదవ్‌(11) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోని.. తాను ఆడిన తొలి బంతికే ఔట్‌ అయ్యాడు. ఆడమ్‌ జంపా వేసిన 33 ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఖవాజా క్యాచ్‌ పట్టడంతో ధోని ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. తన వన్డే కెరీర్‌లో ధోని ఇలా గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కావడం ఐదోసారి.

అంతకుముందు బంగ్లాదేశ్‌(2004, అరంగేట‍్రం మ్యాచ్‌), శ్రీలంక(2005), శ్రీలంక(2007), ఆస్ట్రేలియా(2010) జట్లపై ధోని గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. భారత జట్టు 36 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కాగా, 15 పరుగుల వ్యవధిలో భారత మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 156 పరుగుల వద్ద విజయ్‌ శంకర్‌(46) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కేదార్‌ జాదవ్‌ ఐదో వికెట్‌ ఔటయ్యాడు. ఆపై వెంటనే ధోని ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరు మందగించింది.

ఇక్కడ చదవండి: రోహిత్‌ శర్మ తొలిసారి..

అయ్యో.. విజయ్‌ శంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement