రోహిత్‌ రికార్డు బ్రేక్‌ చేసిన మిథాలీ

Mithali Raj Is Now Indias Highest Run Getter In T20Is - Sakshi

ముంబై: భారత్‌ తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా భారత మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ నిలిచింది. పురుషుల జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల కన్నా ఆమెవే అత్యధిక పరుగులు కావడం విశేషం. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ తరపున రోహిత్‌ చేసిన (2,203) పరుగులను మిథాలీ అధిగమించింది. 84 టీ20 మ్యాచ్‌ల్లో ఈ హైదరాబాదీ బ్యాట్స్‌వుమెన్‌ 37.20 సగటుతో 2,232 పరుగులు చేసింది. ఇక టీ20ల్లో కోహ్లి 2,102 పరుగులతో రోహిత్‌ తరువాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: రోహిత్‌ను ఊరిస్తున్న టీ20 రికార్డు)

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 5వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ బేట్స్‌ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్‌ ప్లేయర్‌ టేలర్‌ (2691), ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఎడ్వర్డ్స్‌(2605), ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమెన్‌ లానింగ్‌ (2,241) మిథాలీ కన్నా ముందు స్థానంలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌, పాక్‌పై గెలిచి దూకుడు మీదున్న భారత మహిళా జట్టు తదుపరి మ్యాచ్‌ను గురువారం ఐర్లాండ్‌తో ఆడనుంది. పురుష క్రికెటర్లకు ఏ మాత్రం తగ్గకుండా భారత మహిళా క్రికెటర్లు బ్యాట్‌ ఝులిపిస్తున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సెంచరీతో చెలరేగగా.. సీనియర్‌ బ్యాట్స్‌వుమెన్‌ మిథాలీ హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చింది. ఇక హార్డ్‌ హిట్టర్‌ మంధాన మెరిస్తె హర్మన్‌ సేనకు తిరుగుండదు. (చదవండి: అమ్మాయిలు  అదుర్స్‌ )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top