కష్టాల్లో కేకేఆర్‌

Lynn, Narine, Rana dismissed cheaply - Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్రిస్‌ లిన్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, సునీల్‌ నరైన్‌(6) కూడా నిరాశపరిచాడు.

దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లో లిన్‌ ఔటైతే, హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో నరైన్‌ పెవిలియన్‌ చేరాడు. లిన్‌ను చాహర్‌ ఎల్బీ రూపంలో ఔట్‌ చేస్తే, నరైన్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ బాట పట్టాడు.  దీపక్‌ చాహర్‌ అద్భుతమైన క్యాచ్‌తో నరైన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సెకండ్‌ డౌన్‌ వచ్చిన నితీశ్‌ రాణా డకౌట్‌ అయ్యాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రాణా ఔటయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top