‘నన్ను క్రికెట్‌పై ఉన్న ప్రేమే నడిపిస్తోంది’

Love for cricket helped me fight off field problems, Shami - Sakshi

బర్మింగ్‌హామ్‌: తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని అటు పోట్లు ఎదురైనా క్రికెట్‌పై ఉన్న ప్రేమే ఆటలో రాణించేలా చేస్తుందని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు తొలి రోజు ఆటలో షమీ రెండు వికెట్లు సాధించాడు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన షమీ.. ఆఫ్‌ ఫీల్డ్‌ సమస్యలతో కొంత కాలం  పాటు జట్టుకు దూరమైనా, పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడం సంతోషంగా ఉందన్నాడు.

‘ నా వ్యక్తిగత ప్రదర్శనతో చాలా ఆనందంగా ఉన్నా. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం నేను కుటుంబ సమస్యలతో సతమతమయ్యా. సుదీర్ఘ కాలంగా వ్యక్తిగత జీవితం పాటు, జట్టులో చోటు కోసం పోరాడుతూనే ఉన్నా. క్రికెట్‌పై ఉన్న ప్రేమే నన్ను నడిపిస్తోంది. నేను క్రికెట్‌కు అధిక ప‍్రాముఖ్యతనిస్తాను కాబట్టి నిలకడగా వికెట్లు సాధించగలుతున్నా. నా లైఫ్‌లో ఎన్నో చికాకులు ఇబ్బంది పెట్టినా,   నా దృష్టి ఎప్పుడూ క్రికెట్‌ ఆడటంపైనే. అదే నన్ను ఈ స్థాయిలో నిలిపింది’ అని షమీ తెలిపాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top