రాహుల్‌ ఫొటోకు అతియా తండ్రి ఫన్నీ రిప్లై | Sakshi
Sakshi News home page

పాపులర్‌ డైలాగ్‌తో ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌

Published Sun, Dec 29 2019 11:16 AM

KL Rhul Instagram Pic With Athiya Shetty - Sakshi

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బ్యాటు పట్టినంత ఈజీగా బాలీవుడ్‌ భామలతో డేటింగ్‌ చేస్తాడని పలువురు ఆయనను బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. గత కొంత కాలంగా రాహుల్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ అతియాశెట్టితో ప్రేమలో ఉన్నాడని వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లడం, కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేయడం, వీళ్లపై వస్తున్న రూమర్స్‌ను ఖండించకపోవడంతో వారిమధ్య ఏదో ఉందని దాదాపు అందరూ ఫిక్సయిపోయపారు. 

ఈ క్రమంలో రాహుల్‌ అతియాతో కలిసి దిగిన ఫన్నీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి ‘హేరా ఫేరీ’ సినిమాలోని ‘హలో దేవీప్రసాద్‌’ అనే పాపులర్‌ డైలాగ్‌ను జోడించాడు. ఈ ఫొటోలో రాహుల్‌ ఫోన్‌ పట్టుకుని గంభీరంగా కనిపిస్తుండగా అతియా మాత్రం నవ్వులు చిందిస్తోంది. ఇక ఈ ఫొటోకు అతియా తండ్రి సునీల్‌ శెట్టి అదే సినిమాలోని ‘ఓకే హంద్‌’ అనే సరదా డైలాగుతో రిప్లై ఇచ్చాడు. ‘క్యూట్‌గా ఉన్నార’ని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ‘చాలా బాగున్నారు’ అంటూ మరో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కామెంట్‌ చేశారు. కాగా రాహుల్‌ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
 

Hello, devi prasad....?

A post shared by KL Rahul👑 (@rahulkl) on

Advertisement
 
Advertisement
 
Advertisement