లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా | kcr given to 15 lakhs worthless lifter Dikshita | Sakshi
Sakshi News home page

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

Sep 16 2017 12:48 AM | Updated on Aug 13 2018 4:03 PM

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా - Sakshi

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 58 కేజీల విభాగంలో స్వర్ణ పతకం

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 58 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ వెయిట్‌లిఫ్టర్‌ ఎర్ర దీక్షితను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత తన తల్లిదండ్రులు వినోద, కేశవ రావు, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా దీక్షితకు ప్రోత్సాహకంగా రూ.15 లక్షల నగదు బహుమానాన్ని సీఎం ప్రకటించారు. దీక్షితకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ పి.మాణిక్యాలరావుకు రూ.3 లక్షల నజరానా ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement