
‘తమిళ్ తలైవాస్’ అంబాసిడర్‌గా కమల్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న ‘తమిళ్ తలైవాస్’ జట్టు తమ జెర్సీని గురువారం చెన్నైలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనుంది.
ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, సచిన్‌లతోపాటు సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ పాల్గొంటారు. ప్రొ కబడ్డీ లీగ్ ఈనెల 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.