ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ శుభారంభం చేసింది.
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ నింజాస్ 5–2తో పంజాబ్ రాయల్స్ జట్టును ఓడించింది. జైపూర్ తరఫున జాకబ్ మకరష్‌విలి (74 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు), ఎలిజ్‌బార్ ఒలికద్జే (97 కేజీలు) తమ బౌట్‌లలో గెలుపొందారు.
పంజాబ్ జట్టుకు ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ వ్లాదిమిర్ ఖిన్‌చెగష్‌విలి (57 కేజీలు), ఒడునాయో అడెకురోయె (53 కేజీలు) విజయాలను అందించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ దంగల్‌తో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది.