
బీజింగ్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ మూడు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కంటే ఎక్కువగా చైనా (2 స్వర్ణాలు, 2 రజతాలు, కాంస్యం), రష్యా (స్వర్ణం, 3 రజతాలు, 3 కాంస్యాలు), కొరియా (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు గెల్చుకున్నాయి. అయితే ‘టాప్’ ర్యాంక్‌ను సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు కాబట్టి భారత్‌కు అగ్రస్థానం లభించింది. చివరి రోజు మాత్రం భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో మను, రాహీ, చింకీ యాదవ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్‌లో గాయత్రి, సునిధి, కాజల్ విఫలమయ్యారు.