పాకిస్తాన్ షరతును తిరస్కరించిన భారత్ | india not to give written assurance on security to pakistan team | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ షరతును తిరస్కరించిన భారత్

Mar 11 2016 11:41 AM | Updated on Sep 3 2017 7:30 PM

టి-20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకుగాను ఆ దేశం పెట్టిన షరతును భారత్ తిరస్కరించింది.

న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడేందుకుగాను ఆ దేశం పెట్టిన షరతును భారత్ తిరస్కరించింది. భారత్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు ప్రకటన చేశారు.

భారత్ ఆతిథ్యమిస్తున్న టి-20 ప్రపంచ కప్లో పాక్ పాల్గొనే విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 19న భారత్, పాక్ల మధ్య మ్యాచ్ జరగాల్సివుండగా.. భద్రత కారణాలతో పాటు పాక్ కోరిక మేరకు వేదికను కోల్కతాకు తరలించారు. అయితే భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలని, అప్పుడే తమ జట్టు ఆ దేశానికి వెళ్తుందని, అప్పటి దాకా పాకిస్తాన్‌ నుంచి కదలరని ఆ దేశ ప్రభుత్వం షరతు విధించింది. ఇందుకు భారత్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చే విషయంలో స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement