50 పరుగులకే ఐదు వికెట్లు

India lose 5th wicket at 50 runs in first test of srilanka - Sakshi - Sakshi - Sakshi

కోల్ కతా:శ్రీలంకతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. 17/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా..మరో 33 పరుగులు జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆట ఆరంభంలోనే ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(4), అశ్విన్(4) వికెట్లను భారత్ కోల్పోయింది. దాంతో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రహానే, అశ్విన్ లిద్దరూ లంక మీడియం పేసర్ దాసన్ షనక బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. కాగా, భారత్ స్కోరు 32.5 ఓవర్లలో 74/5 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి మరో ఓవర్ నైట్ ఆటగాడు చతేశ్వర పుజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో9 ఫోర్లు), సాహా(6 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలోలక్మల్ మూడు వికెట్లు సాధించగా, షనకకు రెండు వికెట్లు  తీశాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top