టీమిండియా..ఏడేళ్ల తరువాత తొలిసారి!

india first time after 7 years losing 4 wickets  30 or less Runs - Sakshi - Sakshi

కోల్ కతా: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా  దాదాపు ఏడేళ్ల తరువాత ఓ చెత్త రికార్డును తిరగరాసింది. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా బౌలింగ్ అనుకూలించే పిచ్ పై భారత టాపార్డర్ బ్యాట్స్ మెన్ దాదాపు చేతులేత్తెయడంతో ఏడేళ్ల నాటి పేలవ రికార్డును చూడాల్సివచ్చింది. 30 పరుగులకే భారత్ నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఫలితంగా 30 అంతకంటే తక్కువ పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోవడం స్వదేశంలో ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి.చివరిసారి 2010లో కివీస్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో భారత్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

లంకేయులతో మ్యాచ్ లో 17/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా..మరో 33 పరుగులు జోడించి రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆట ఆరంభంలోనే ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(4), అశ్విన్(4) వికెట్లను భారత్ కోల్పోయింది. దాంతో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రహానే, అశ్విన్ లిద్దరూ లంక మీడియం పేసర్ దాసన్ షనక బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. కాగా, భారత్ స్కోరు 32.5 ఓవర్లలో 74/5 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి మరో ఓవర్ నైట్ ఆటగాడు చతేశ్వర పుజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో9 ఫోర్లు), సాహా(6 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలోలక్మల్ మూడు వికెట్లు సాధించగా, షనకకు రెండు వికెట్లు  తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top