పొల్యూషన్‌ మాస్క్‌లతోనే ప్రాక్టీస్‌ | Ind vs Ban: Pollution Masks At Training In Delhi | Sakshi
Sakshi News home page

పొల్యూషన్‌ మాస్క్‌లతోనే ప్రాక్టీస్‌

Oct 31 2019 4:21 PM | Updated on Oct 31 2019 4:21 PM

Ind vs Ban: Pollution Masks At Training In Delhi - Sakshi

ఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాయు కాలుష్య సెగ తప్పలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో గత కొన్ని రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది. దీనిలో భాగంగా భారత  పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లు పొల్యూషన్‌ మాస్క్‌లు ధరించి ప్రాక్టీస్‌ చేశారు.

తప్పని పరిస్థితుల్లో ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వేదికను చివరి దశలో మార్చాలని చూసినా అది సాధ్యపడలేదు. దాంతో ఢిల్లీలోనే తొలి టీ20 జరుగనుంది. టి20 సిరీస్‌లో పాల్గొనే బంగ్లాదేశ్‌ జట్టు బుధవారం రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 3, 7, 10 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.  అటు తర్వాత రెండు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement