ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హారిక, పద్మిని | Harika,Padmini in the pre quarter-final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హారిక, పద్మిని

Feb 16 2017 11:56 PM | Updated on Sep 5 2017 3:53 AM

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హారిక, పద్మిని

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హారిక, పద్మిని

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్ షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్‌ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్ షిప్‌
టెహరాన్ : ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్ షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్‌ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. గురువారం జరిగిన రెండో రౌండ్‌ టైబ్రేక్‌ పోరులో వీరిద్దరు తమ ప్రత్యరు్థలను 1.5–0.5 పాయింట్ల (ఓవరాల్‌గా 2.5–1.5) తేడాతో ఓడించారు.

దినారా సదుకసోవా (కజకిస్తాన్ )తో జరిగిన తొలి టైబ్రేక్‌ గేమ్‌లో తెల్ల పావులతో ఆడి హారిక 57 ఎతు్తల్లో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండో గేమ్‌ 49 ఎతు్తల్లో డ్రాగా ముగియడంతో హారికను విజయం వరించింది. జావో జుయ్‌ (చైనా)తో జరిగిన టైబ్రేక్‌లో కూడా పద్మిని తొలి గేమ్‌ను 65 ఎతు్తల్లో గెలుచుకుంది. నల్ల పావులతో ఆడినా పద్మిని దూకుడు ప్రదర్శించింది. రెండో గేమ్‌ 76 ఎతు్తల్లో డ్రాగా ముగిసింది. ఫలితంగా ఆమె కూడా ముందంజ వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement