హరికృష్ణకు మూడో గెలుపు 

Hari Krishna took the third Consecutive Win - Sakshi

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ వరుసగా మూడో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం యు యాంగి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 76 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఐదో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top