మే 15న షరపోవాపై నిర్ణయం | French Open decision on Maria Sharapova on May 15 | Sakshi
Sakshi News home page

మే 15న షరపోవాపై నిర్ణయం

Apr 21 2017 1:11 AM | Updated on Sep 5 2017 9:16 AM

మే 15న షరపోవాపై నిర్ణయం

మే 15న షరపోవాపై నిర్ణయం

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రష్యా టెన్నిస్‌ తార మరియా షరపోవాకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే అంశంపై మే

పారిస్‌: గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రష్యా టెన్నిస్‌ తార మరియా షరపోవాకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే అంశంపై మే 15న స్పష్టత రానుంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్‌) గురువారం ప్రకటించింది. ‘రోలండ్‌ గారోస్‌ టోర్నీ క్వాలిఫయర్స్‌కు వారం రోజుల ముందు మే15న షరపోవా విషయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఒకవేళ మేం వైల్డ్‌కార్డ్‌ అనుమతి ఇవ్వకపోయినా క్వాలిఫయర్స్‌ ఆడి ఆమె ఈ టోర్నీలో పాల్గొనవచ్చు’ అని ఎఫ్‌టీఎఫ్‌ అధ్యక్షుడు బెర్నార్డ్‌ గుడిసెలి అన్నారు.

మే 28 నుంచి జూన్‌ 11 వరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ జరగనుంది. మరోవైపు సెరెనా విలియమ్స్‌ కూడా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సీజన్‌ టోర్నీల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దొరుకుతుందని అభిమానులు ఆశించారు. అయితే సెరెనా, షరపోవాలిద్దరివి విభిన్నమైన కేసులు. ఒకరి గైర్హాజరీతో మరొకరికి సంబంధం లేదని బెర్నార్డ్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement