తొలి టీమిండియా క్రికెటర్‌గా.. | Few Records Prithvi Shaw broke on debut | Sakshi
Sakshi News home page

తొలి టీమిండియా క్రికెటర్‌గా..

Oct 4 2018 2:18 PM | Updated on Oct 4 2018 7:55 PM

Few Records Prithvi Shaw broke on debut - Sakshi

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మొదటి మ్యాచ్‌ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా అదరగొట్టాడు. 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకోవడం ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడమే కాకుండా, మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు సచిన్‌ టెండూల‍్కర్‌ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు.

కాగా, అరంగేట్రపు రంజీ, దులీప్‌ ట్రోఫీ, టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి టీమిండియా క్రికెటర్‌గా షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు సెంచరీకి ముందు దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో షా విశేషంగా రాణించాడు. ఆ క్రమంలోనే అరంగేట్రపు రంజీ, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ల్లో శతకాలతో మెరిశాడు. ఇక్కడ మాస్టర్‌ బ్లాస్టర్‌, దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ కేవలం  దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ అరంగేట్రపు మ్యాచ్‌లో మాత్రమే సెంచరీలు సాధించగా, పృథ్వీ షా మాత్రం ‘మూడింటి’లో శతకాలు సాధించిన మొదటి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌ తరపున పిన్నవయసులో టెస్టు సెంచరీ సాధించిన ఘనత సచిన్‌ టెండూల్కర్ పేరిట ఉన్నప్పటికీ, అతనికి టెస్టుల్లో శతకం సాధించడానికి 13 మ్యాచ్‌లు వేచి చూడాల్సి వచ్చింది.

ఇదిలా ఉంచితే, అరంగేట్రపు టెస్టుల్లో సెంచరీ సాధించిన 15వ భారత క్రికెటర్‌ పృథ్వీ షా. అయితే 2013లో రోహిత్‌ శర్మ అరంగేట్రపు టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన తర్వాత ఆ ఘనత సాధించిన తొలి టీమిండియా క్రికెటర్‌గా షా నిలిచాడు. రోహిత్‌ శర్మ కూడా విండీస్‌పైనే టెస్టుల్లో అరంగేట‍్రం చేసి శతకం సాధించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. అయితే ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షాతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. తొలి ఓవర్‌లోనే గాబ్రియేల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వికెట్లు ముందు దొరికిపోయాడు. అటు తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన పృథ్వీ షా తన సహజసిద్ధమైన ఆట తీరుతో అలరించాడు. పుజారాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే షా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 209 పరుగుల వద్ద పుజారా(86) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై కాసేపటికి షా(134;154 బంతుల్లో 19 ఫోర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో టీ విరామానికి భారత్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

పృథ్వీ షా బ్యాటింగ్‌ రికార్డులు..

59 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిన పృథ్వీ షా

అరంగేట్రంతోనే పృథ్వీషా ఖాతాలో రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement