'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి' | Ex ICC chief Ehsan Mani fears for game's future | Sakshi
Sakshi News home page

'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి'

Apr 9 2015 12:13 PM | Updated on Sep 3 2017 12:05 AM

'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి'

'ఆ దేశాలే ఐసీసీని శాసిస్తున్నాయి'

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కల్గిన క్రికెట్ భవిష్యత్తుపై మాజీ ఐసీసీ అధ్యక్షుడు ఇహసాన్ మణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్రికెట్ లో ఆరోగ్యకరమైన పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని స్పష్టం చేశారు.

లండన్:ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కల్గిన క్రికెట్ భవిష్యత్తుపై మాజీ ఐసీసీ అధ్యక్షుడు ఇహసాన్ మణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్రికెట్ లో ఆరోగ్యకరమైన పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ గవర్నింగ్ సమాఖ్య తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా మణి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వరల్డ్ కప్(2019)నాటికి టెస్ట్ హోదా కల్గిన పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో చాలా టీమ్ లో క్రికెట్ ఆడుతుంటే కేవలం 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తానడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు.

 

గత క్రికెట్ కు, ఇప్పటి క్రికెట్ కు చాలా వ్యత్యాసాలు వచ్చాసాయన్నారు.  క్రికెట్ అనేది వ్యాపార పరంగా మారుతోందన్నారు. ప్రధానంగా మూడు దేశాల అధీనంలోనే ప్రపంచ క్రికెట్ నడుస్తోందన్నారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ మూడు జట్లు ఐసీసీని శాసిస్తున్నాయన్నారు. చాలా జట్లు ఆర్థికంగా తగిన బలంగా లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని మణి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement