
సెంచరీతో చెలరేగిన దినేశ్ కార్తీక్
బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఇండియా సిమెంట్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇండియా సిమెంట్స్ 10 పరుగుల తేడాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం)పై విజయం సాధించింది.
ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఇండియా సిమెంట్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇండియా సిమెంట్స్ 10 పరుగుల తేడాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం)పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సిమెంట్స్ 50 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (88 బంతుల్లో 108; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం సాధించగా...ముకుంద్ (45), బాబా అపరాజిత్ (41) రాణించారు. ఒక దశలో 98/5తో కష్టాల్లో పడ్డ జట్టును కార్తీక్ ఆదుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 278/6 స్కోరుతో ఎస్‌బీఎం విజయానికి చేరువైంది.
18 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో బాలాజీ (5/40) చెలరేగాడు. అతని బౌలింగ్ ధాటికి ఎస్‌బీఎం 49.4 ఓవర్లలో 288 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున అనిరుధ్ జోషి (58 బంతుల్లో 76; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేశ్‌పాండే (60), మీర్ అబ్బాస్ (60) అర్ధ సెంచరీలు చేశారు. గురువారం జరిగే ఈ టోర్నీ తొలి సెమీ ఫైనల్లో ‘కాగ్’తో ఇండియా సిమెంట్స్, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ కెమ్‌ప్లాస్ట్‌తో బీపీసీఎల్ తలపడతాయి.