
బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిరాశపరిచాడు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ ఆదిలోనే ధావన్ వికెట్‌ను కోల్పోయింది. ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ గోల్డెన్ డక్ అపప్రథను మూటగట్టుకున్నాడు. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ధావన్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు.సౌతీ వేసిన తొలి బంతికి పృథ్వీ షా పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి పరుగు తీశాడు. దాంతో బ్యాటింగ్ ఎండ్‌లోకి వచ్చిన ధావన్ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు.నవదీప్ షైనీకి క్యాచ్ ఇచ్చి ధావన్ ఔటయ్యాడు.
(ఇక్కడ చదవండి: ఆర్సీబీతో మ్యాచ్: రబడ విజృంభణ)