ఆసీస్‌పై సరికొత్త రికార్డు

Dhawan and Rohit Pair Got New Record with Highest opening stand Against Australia - Sakshi

మొహాలీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 193 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. రోహిత్‌ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక‍్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్‌ బౌలర్‌ జై రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. అయితే వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యం సాధించిన భారత్‌ ఓపెనింగ్‌ జోడిగా సరికొత్త రికార్డును నెలకొల‍్పింది. ఈ క్రమంలోనే రోహిత్‌-ధావన్‌లు గతంలో ఆసీస్‌పై నెలకొల్సిన ఓపెనింగ్‌ రికార్డును వారే బ్రేక్‌ చేసుకున్నారు. 2013లో నాగ్‌పూర్‌లో జరిగిన వన్డేలో ఈ జోడి 178 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించింది. దాన్ని తాజా మ్యాచ్‌లో బద్దలు కొడుతూ సరికొత్త రికార్డును రోహిత్‌-ధావన్‌ల జంట నమోదు చేసింది.
(ఇక్కడ చదవండి: మరో ‘సెంచరీ’ కొట్టేశారు..!)

మరొకవైపు శిఖర్‌ ధావన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో శతకం సాధించాడు. ఇది ధావన్‌కు 16వ వన్డే సెంచరీ కాగా ఆస్ట్రేలియాపై మూడో సెంచరీ. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు రోహిత్‌-ధావన్‌లు శుభారంభం అందించారు. ఒకవైపు ధావన్‌ ధాటిగా బ్యాటింగ్‌ కొనసాగిస్తే, రోహిత్‌ మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే ధావన్ హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు.ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని ధావన్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. మరొక ఎండ్‌లో రోహిత్‌ నుంచి పూర్తి సహకారం లభించడంతో ధావన్‌ రెచ్చిపోయి ఆడాడు. కాగా, రోహిత్ సెంచరీకి చేరువలో ఔట్‌ కావడం నిరాశపరిచింది. భారత్‌ 34 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 209 పరుగులు చేసింది.
(ఇక్కడ చదవండి: రోహిత్‌-ధావన్‌ల జోడి మరో ఘనత)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top