ఇదే వాగ్ధానం.. ఎప్పటికీ ప్రేమలో ఉంటాం.. | Confirmed! Anushka, Virat are now married | Sakshi
Sakshi News home page

ఇదే వాగ్ధానం.. ఎప్పటికీ ప్రేమలో ఉంటాం..

Dec 11 2017 8:19 PM | Updated on Dec 11 2017 10:36 PM

Confirmed! Anushka, Virat are now married - Sakshi

టస్కనీ : భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మల పెళ్లి  అంగరంగ వైభవంగా జరిగింది. తమ జీవితాకు సంబంధించిన ఆనంద సమయాన్ని ఇరువురు తారలు అభిమానులతో పంచుకున్నారు. ‘ఎప్పటికీ ప్రేమలో ఉండటానికి ఈ రోజు మేం పరస్పరం వాగ్ధానం చేసుకున్నాం. ఈ మరపురాని రోజుకు సంబంధించిన విషయాలను మీతో(అభిమానులతో) పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ విరుష్కలు ప్రకటన చేశారు.

అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖర్చైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చేశారు.

పెళ్లి తర్వాత డిసెంబర్‌ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.

 (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement